తాళమ్ము గానట్టి తాళమేది?
సాహితీమిత్రులారా!
పొడుపు పద్యాలలో మరొకటి చూడండి.
తాళమ్ముగానట్టి తాళమయ్యది యేది?
తాళమ్ముగానట్టి తాళమేది?
తాళమ్ముగానట్టితాళమయ్యది యేది?
తాళమ్ముగానట్టి తాళమేది?
తాళమ్ముగానట్టి తాళమయ్యది యేది?
తాళమ్ముగానట్టి తాళమేది?
తాళమ్ముగానట్టి తాళమయ్యది యేది?
తాళమ్ముగానట్టి తాళమేది?
తాళమచ్చముగానట్టి తాళమేది?
తాళమచ్చముగానట్టి తాళమేది?
చెప్పవలెఁదుద "తాళము" చేర్చి చేర్చి
దేవ శ్రీవేంకటేశ! పద్మావతీశ!
ఇందులో పది ప్రశ్నలు ఉన్నాయి.
వాటి సమాధానలకు చివరలో "తాళము" అని ఉండాలి.
ఆలోచించండి.
1. తాళముగాని తాళము - పాతాళము (నాగలోకము)
2. తాళముగాని తాళము - భేతాళము (పిశాచము)
3. తాళముగాని తాళము - హరితాళము (హరిదళము)
4. తాళముగాని తాళము - కాంతాళము (కోపము)
5. తాళముగాని తాళము - కరతాళము (చేతిచప్పుడు)
6. తాళముగాని తాళము - శ్రీతాళము (ఒకతాటిదినుసు)
7. తాళముగాని తాళము - హింతాళము(గిరకతాటిచెట్టు)
8. తాళముగాని తాళము - ఆదితాళము (ఒక తాళభేదము)
9. తాళముగాని తాళము - ఆటతాళము (ఒక తాళభేదము)
10. తాళముగాని తాళము - రూపకతాళము(ఒక తాళభేదము)
No comments:
Post a Comment