Saturday, August 6, 2016

గోపబాల జగతి గొల్తు నిన్ను


గోపబాల జగతి గొల్తు నిన్ను


సాహితీమిత్రులారా!

ఈ పద్యం చూడండి ఇందులో కవి ఒక పేరును గోపనం చేశాడు గమనించండి.
ఇది రాప్తాటి ఓబిరెడ్డి రచిత
శ్రీనివాస చిత్రకావ్యంలోనిది.

శ్రీశ వరద తిరుమలేశ రుక్మాంబర
రామ కృష్ణ శ్యామల శుభదేహ
వెంకటేశ సకల భీసంకట నివార
గోపబాల జగతి గొల్తు నిన్ను

ఇందులో శ్రీతిరుమల వెంకటపతి అనే పేరును గోపనం చేశాడు.
దీనిలో మొదటి అక్షరం తీసుకొని తరువాత ప్రతి 5వ అక్షరం
తీసుకుంటే ఆ పేరు బహిర్గతమౌతుంది.

శ్రీశ వరద తిరుమలేశ రుక్మాంబర
రా కృష్ణ శ్యామ శుభదేహ
వెంకటేశ సల భీసంక నివార
గోబాల జగతి గొల్తు నిన్ను

శ్రీతిరుమల వెంకటపతి

No comments: