కంధర కమలారి కార్ముక కంజాత
సాహితీమిత్రులారా!
ఈ పద్యం చూడండి ప్రతి పాదము
ఒక ప్రత్యేకతతో కనిపిస్తుంది.
గమనించండి.
కంధర కమలారి కార్ముక కంజాత
కాంచన కంబుల గర్వమణఁచి
పద్మరాగ పటీర పద్మారి పన్నగ
పద్మ పల్లవముల బాగునొంచి
వజ్ర వల్లీద్వయ వసుమతీధర వార
ణారి వారణ వసుధాళిఁగేరి
కదళికా కాహళ కచ్ఛప కలకంఠ
కనక కర్పూరసంఘముల మీఱి
(కచ ముఖ భ్రూ నయన నాసికా గ -ళోష్ఠ
పరిమళ కపోల రోమాళి పద కర - రద
బాహు కుచ మధ్య గతి నితంబాంక జంఘ
పద ర వాంగ స్మితము లొప్పు భామినులకు)
(హంసవింశతి 5-275)
ఈ పద్యంలో సీసపద్యంలోని నాలుగు పాదాలలో ప్రతిపాదము
మొదట ఏ అక్షరంతో ప్రారంభమవుచున్నదో
పాదమంతా(దాదాపుగా)పాదములోని ప్రతిపదం
ఆ అక్షరంతోనే ప్రారంభమైనది.
దీన్ని ఆదివర్ణావృత్తిపాదము అంటారు.
ఇది శబ్దచిత్రంలోనిది.
ఇదేకాక ఈ పద్యంలో సీసపద్యంలో 24 ఉపమానాలుంటే
గీత పద్యంలో 24 ఉపమేయాలున్నాయి.
దీన్ని గురించి మరోచోట వివరంగా తెలుసుకుందాము.
No comments:
Post a Comment