Monday, August 8, 2016

అధిక తేజోzస్తు తే నిషధాధిరాజ! (అనుకరణ పద్యం)



   అధిక తేజోzస్తు తే నిషధాధిరాజ! (అనుకరణ పద్యం)


సాహితీమిత్రులారా!

ఇది శ్రీనాథుని చమత్కార చాటుపద్యం

శ్రీరస్తు! భవదంఘ్రి చికురంబులకు మహా భూర్యబ్దములు సితాంభోజ నయన!
వరకాంతిరస్తు! తావకముఖ నఖముల కాచంద్రతారకంబబ్జ వదన!
మహిమాస్తు! నీ కటి మధ్యంబులకు మన్ను మిన్నుగ లన్నాళ్ళు మించుబోడి!
విజయోస్తు! నీ గాన వీక్షల కానీల కంఠ హరిస్థాయిగా లతాంగి!
కుశలమస్తు! భవచ్ఛాత కుంభ కుంభ
జంభ భిత్కుంభి కుంభా భిజృంభమాణ
భూరి భవదీయ వక్షోజములకు మేరు
మందరము లుండు పర్యంత మిందువదన!


దీనికి అనుకరణగా ఉన్న ఈ పద్యం
పెదపాటి ఎఱ్ఱాప్రగడ  రచిత
కుమారనైషధములోనిది


శ్రీ సిద్ధి రస్తు శాసితవైరిమండల!
        విజయోzస్తు భువనైక వీరవర్య!
అభ్యుదయోzస్తు సాహసబలసామగ్ర్య!
       కల్యాణ మస్తు నిష్కలుషహృదయ!
శుభమస్తు కారణ్యవిభవసముజ్జ్వల!
         బ్రహ్తాయురస్తు భూపాలతిలక?
అభివృద్ధిరస్తు మహౌదార్యభూషణ!
          చిరకీర్తిరస్తు భాసురగుణాఢ్య!
తుష్టిరస్తు నిజాంకనిర్ధూతకలుష!
పుష్టిరస్తు జగత్త్రయీపూతచరిత!
భద్రమస్తు మహీభారభరణ నీకు!
నధిక తేజోzస్తు తే నిషధాధిరాజ!
           (పెదపాటి ఎఱ్ఱాప్రగడ - కుమారనైషధము)

No comments: