కాంతనెమ్మోము గెల్చు కంజాతములను
సాహితీమిత్రులారా!
ఈ పద్యం గమనించండి.
కాంతనెమ్మోము గెల్చు కంజాతములను
కాంత కంజాతములు గెల్చు కంధరముల
కంధరంబును సమదశంఖంబు గెల్చు
శంఖభావంబు నయ్యర్ధచంద్రుగెల్చు
(నానార్థగాంభీర్యచమత్కారిక)
కాంత ముఖం పద్మము(కంజాతము)లను గెలుస్తుంది.
కాంతశిరోజా(కంజాతము)లు మేఘము(కంధరము)ను గెలుస్తుంది.
కంఠము(కంధరము) శంఖాన్ని గెలుస్తుంది
నుదురు(శంఖము) అర్థచంద్రుని గెలుస్తుంది.
నానార్థాలు -
కం - నీరు - కంజము - నీటిలో పుట్టునది - పద్మము
- కంధరము - నీటిని ధరించునది - మేఘము
కంజము - తామర, అమృతము, వెండ్రుక
కంధరము - మెడ(కంఠము), మబ్బు(మేఘము)
శంఖము - నొసటి ఎముక, గజదంతమధ్యభాగము, నిధి విశేషము,
సర్పవిశేషము, నఖమనెడి గంధద్రవ్యము.
1 comment:
మీ రిస్తున్న పద్యాలు, వాని వివరాలు, వివరణ అద్భుతంగా ఉంటున్నవి. ధన్యవాదాలు.
రెండవ పాదం చివర 'కంధరములను' లో 'ను' అధికమై గణదోషం. 'కంధరముల' అంటే సరి!
Post a Comment