వైదుష్య మేకం విదుషాం సహాయమ్
సాహితీమిత్రులారా!
మల్లినాథసూరి అను నామాంతరము గల పెద్దిభట్టు
ఒకరోజు సింగభూపాలుని సభకు రాజదర్శనార్థం పోతుండగా,
చీఁకిరి బాఁకరి చినిగిన పాతబట్టలతో వంకర టింకర కర్రచేత పట్టుకొని ఉన్న
ఆయనను కొందరు "తాతా ఏమిటి ఇలాంటి వేషంలో వెళుతున్నావే?" అని
అడగ్గా ఆయన చెప్పిన శ్లోకం -
కిం వాససా చీకిరి బాకిరేణ
కిం దారుణా వంరకటింకరేణ
శ్రీసింగభూపాల విలోకనార్థం
వైదుష్య మేకం విదుషాం సహాయమ్
(పల్లకీలు లేకపోతేనేమి పల్లకీకి చీకిరి బాకిరి కుచ్చులు
వంకరటింకర బొంగు ఉంటుంది సింగభూపాలుని దర్శనానికి
గణాధిపతి ప్రసాదంకలిగినవాడిని
నాకు వేరే సహాయం అక్కరలేదు - అని భావం)
ఇందులో చీకిరి బాకిరి, వంకర టింకర
లాంటివి తెలుగు పదాలుగా అనిపిస్తున్నాయి కదా!
No comments:
Post a Comment