Saturday, August 6, 2016

తతేతాతేత తాతుతా


తతేతాతేత తాతుతా


సాహితీమిత్రులారా!

ఏకాక్షర శ్లోకాలు పద్యాలు కొన్నిటిని మనం చూచి ఉన్నాము.
ఇపుడు పాదుకాసహస్రంలో వేదాంతదేశికులవారు చేసిన
ఈ ఏకాక్షరశ్లోకం చూడండి.

తతాతత్తా తితత్తేతా తాత తీతేతి తాతితుత్
తత్తత్తత్తాత తితతా తతేతాతేత తాతుతా
                                         (పాదుకాసహస్రము - 935)


పదచ్ఛేదం - 1. తతాతత్తా 2. అతి తత్తేతా, 3. తాతతి, 4. ఇతేతితాతితుత్
                  5. తత్తత్తత్తాతతితతా, 6. ఆతతా, 7. తాతుతా 8. తాతతి

అర్థం -
తతాతత్తా తతా - తతా = విస్తృతమైన, అతత్తా = సంచరించే ధర్మం కలిగిన,
అతితత్తేతా - అతి = అతిక్రమించిన, తత్ + తా = పరబ్రహ్మ కలిగిన భావంతో,
ఇతా = కూడినట్టి, ఇతేతి తాతితుత్ - ఇత = పొందిన,
ఈతి తా = ఈతిబాధలుకల(వారి) భావాన్ని, అతి = మిక్కలి.
తుత్ = నశింపజేయునట్టి, తత్తత్తతా తతి తతా -
తత్ + తత్ = ఆయావస్తువుల యొక్క,
తత్ + తా = ఆయాధర్మం యొక్క, తతి = సముదాయంతో,
తతా = విస్తరింపబడిన, ఆ తతా = పలుదెసల వీణాది వాద్య నాదం కలిగినట్టి,
ఇతాతేతతాతుతా - ఇ = మన్మథుని యొక్క, తాత = తండ్రియైన విష్ణువుతో,
ఇత = కూడిన, తాతుతా = పాదుక, తాతతి = తండ్రిలాగా ఆచరిస్తుంది.

No comments: