Thursday, February 2, 2017

ఆరు ప్రశ్నలుకు మూడక్షరాలున్న నది ఏది?


ఆరు ప్రశ్నలుకు మూడక్షరాలున్న నది ఏది?



సాహితీమిత్రులారా!

ఈ శ్లోకంలో 6 ప్రశ్నలున్నాయి చూడండి-

మర్త్యాః కుత్రవసన్తి కస్యవిశిఖాః పుష్పాణి కా వారిధేః
కన్యా? ధాతృమురారిమన్మథ జితాం కా వాను సమ్బుద్దయః
కస్మిన్ముక్తికరీ రతి ర్దినిషదాం సున్దోపసున్దౌ చ కా
వేషా ముత్తరతాం ప్రయాతి తటినీ కాచి త్త్రివర్ణాహ్యయా

దీనిలోని ప్రశ్నలకు సమాధానాలు అన్నిటిని కలిపి
మూడక్షరముల నది ఒకటి సమాధానమౌతుంది.

ప్రశ్నలు -
1. మర్త్యాః కుత్రవసంతి? (మనుషులు ఎక్కడ నివసిస్తారు?)
   - కౌ (భూమియందు)
2. కస్యవిశిఖాః పుష్పాణి? (ఎవని బాణాలు పూలు?)
   - ఏః (మన్మథునివి)
3. కా వారిధేః కన్యా? (సముద్రుని కూతురు ఎవరు?)
   - ఈ (లక్ష్మి)
4. ధాతృమురారిమన్మథ జితాం కా వాను సమ్బుద్దయః?
   (బ్రహ్మ విష్ణు శివులకు సంబోధనలు ఏవి?)
   - క, అ, ఓ
5. కస్మిన్ రతిః ముక్తకరీ?
   (ఎవరియందు ఆసక్తి మోక్షాన్ని కలిగిస్తుంది?)
   - ఏ (విష్ణువునందు)
6. దివిషదాం సున్దోప సున్దౌకౌ ?
   (దేవతలకు సుందోప సుందులెవరు?)
  - అరీ(శత్రువులు)
పై సమాధానాలలో మొదటి మూడింటిని కలుపగా
కౌ + ఏః + ఈ =  కావేరీ
కౌ + ఏః = కావేః (ఆవాదేశసంధి)
కావేః + ఈ = కావేరీ(విసర్గసంధి)
4,5,6 సమాధానాలు కలుపగా
క + ఆ + ఓ + ఏ + అరీ = కావేరీ
ఈ విధంగా సమాధానాలను బట్టి ఆ నదిపేరు - కావేరీ(నది)

No comments: