Wednesday, February 8, 2017

తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్


తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ 
సాహితీమిత్రులారా!సమస్య -
తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ 


 పూర్వకవి పూరణ-

పలుకూరి దేవళంబున 
సలలితముగ మొన్నఁ జేయు సంతర్పణకున్
దొలుతను మీరంపిన చిం
తలకాయల పులుసు త్రాగి తనిసిరి బాపల్ 

దీనిలో తలకాయల పులుసు కాదు బాపలు తాగినది
చింతలకాయల పలుసు త్రాగి తనిసిరి బాపలు - అని
సమస్యను కడు రమణీయంగా పూరించారు కవిగారు.

మీరును మరో రమ్యమైన భావనతో పూరించి పంపగలరు.

No comments: