కరవది, కొప్పోలు, వంగొల్లు
సాహితీమిత్రులారా!
సమస్యలలోని మరోవిధం దత్తపది
దత్తపది -
కరవది, వంగొల్లు, కొప్పోలు, దశరాజుపల్లె
ఈ గ్రామాల పేర్లను ఉపయోగించి
ద్రౌపదీ పరాభవకథ గీతపద్యంలో
చెప్పమని అడుగగా
పూర్వకవి పూరణ-
బంధు కఱవది యేలోయి పార్థివేంద్ర
కుమిలి జనులెల్ల రవరవం గొల్లుమనఁగ
ననఁగ మానిని కొప్పోలి నదర నీడ్చె
పాపదశ రాజు పల్లెత్తి పలుకఁడయ్యె
ఇందులో అడిగిన విధంగా పల్లెలపేర్లు,
ద్రౌపది పరాభవ కథ, గీతపద్యంలో
చెప్పబడింది.
No comments:
Post a Comment