తల్లీ! రమ్మని పిల్చె భర్త నిజకాంతన్
సాహితీమిత్రులారా!
సమస్య -
తల్లీ! రమ్మని పిల్చె భర్త నిజకాంతన్ మన్మథక్రీడకున్
తిరుపతి వేంకట కవుల పూరణ-
ఉల్లోల్లాంబుఝరీస్పురచ్ఛఫరజాలోన్మేష నేత్రాంత! భూ
భృల్లీలా స్తనయుగ్మ! నీచతరనాభీ సుందరావర్త! యో
షిల్లోకప్రణుత ప్రకాశ! లలనా! సీమంతినీ జాతి మ
త్తల్లీ! రమ్మని పిల్చె భర్త నిజకాంతన్ మన్మథక్రీడకున్
(శతావధానసారము ద్వితీయఖండము)
దీనిలో తల్లి అనేది తెలుగులో మాత,
కానీ సంస్కృతంలో తల్లి అని అర్థం.
జాతిమత్తల్లీ - జాజిపూవులు గుబాళించే తరుణి.
అందువల్ల తల్లినికాదు తరుణిని
తన భర్త ఆమెను పిలిచినట్లు పూరించారు
(కనుగవ మిలమిలలాడుతున్న,
ఉప్పొంగిన చనుగవ కలది,
కృంగిపోయిన నాభిగలది,
వనితాలోకంలో బాగా పొగడదగిన నవ్వు గలది
(ప్రకాశ = తలఆడిస్తూనవ్వెడు నవ్వు)
జాజిపూల వాసనతో గుమాళించెడిది అయిన
స్త్రీని రతికేళికి రమ్మని ఆమె భర్త
పిలిచాడు- అని భావం)
(దీనిలోని వర్ణనలన్నీ
స్త్రీ ఋతుమతి కాలంలోని సంకేతాలు)
మీరును మరో విధంగా పూరించి పంపగలరు
No comments:
Post a Comment