Wednesday, February 1, 2017

ఎందరొ యెందరో మరియు నెందరు నెందరొ


ఎందరొ యెందరో మరియు నెందరు నెందరొ
సాహితీమిత్రులారా!


సమస్య -
ఎందరొ యెందరో మరియు నెందరు నెందరొ యెందరెందరో

 సింహాద్రి శ్రీరంగంగారి పూరణ -

బందుగులాప్త వర్గములు భార్యలు, భర్తలు బాలబాలికా
బృందము, కొంప గోడులును పెట్టెలు బేడలు, జంతు సంతతుల్
డెందములన్ పగుల్చుచుగడింది విచారము కూర్పనేడ్చువా
రెందరొ యెందరో మరియు నెందరు నెందరొ యెందరెందరో


సర్వనామాలతో కూడిన సమస్యను
ఎంత చక్కగా పూరించాడో కదా!మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

No comments: