Tuesday, February 7, 2017

హరి పావక యమ నైఋతి


హరి పావక యమ నైఋతి




సాహితీమిత్రులారా!


క్రిష్టిపాటి వేంకట సుబ్బకవి కృత
కేదారోపాఖ్యానమునందలి
ఈ గూఢచిత్రం చూడండి-
ఇది కందపద్యం ఇందులో
అష్టదిక్పాలకులను, నవగ్రహములను స్తుతించాడు.

హరి పావక యమ నైఋతి
వరుణనిల ధనద భర్గ వనజహితాబ్జా
ధరసుత బుధ గురు రవి శని
వర రాహుధ్వజుల మదిని వర్ణింతున్
                                            (కేదారోపాఖ్యానము - అవతారిక - పుట-4)

దీనిలో పూర్వార్థము అష్టదిక్పాలకులను
ఉత్తరార్థములో నవగ్రహములను స్తుతించాడు.

నవగ్రహములు-
హరి - ఇంజద్రుడు
పావకుడు - అగ్ని,
యముడు, నైఋతి, వరుణుడు,
అనిలుడు - వాయువు,
ధనదుడు - కుబేరుడు,
భర్గుడు - ఈశానుడు

 అష్టదిక్పాలకులు-
ధరసుతుడు - అంగారకుడు / కుజుడు,
బుధుడు,
గురువు -బృహస్పతి,
రవి- సూర్యుడు
శని, రాహువు,
ధ్వజుడు - కేతువు,
పరిశేష న్యాయం ప్రకారం-
శుక్రుడు, చంద్రుడు గ్రహించాలి.

నవగ్రహాల క్రమం ఈ విధంగా ఉండాలి -

ఆదిత్యాయ సోమాయ అంగారక బుధాయచ
గురుశుక్రశనిగ్రహశ్చ రాహవేకేతవేనమః

కాని కవి ఈ వరుసలో తీసుకోలేదు.


No comments: