Wednesday, February 15, 2017

పాపాకూపారపాళీపా


పాపాకూపారపాళీపా




సాహితీమిత్రులారా!

వేదాంతదేశికు
శ్రీరంగనాయక పాదుకా సహస్రంలో
40 శ్లోకాలు చిత్రకవితతో కూర్చారు
అందులోని 18 శ్లోకం చూద్దాం-

పాపాకూపారపాళీపా
త్రిపాదీ పాదపాదపా
కృపా రూపా జపాలాపా
స్వాపా మాపా న్నృపాధిపా

(పాపసముద్రమునంతటినీ పానం చేసేది,
వైకుంఠుని చరణాలను కాపాడేది,
దయాప్రచురయైన, జపంలాగా తన కీర్తన కలిగిన
సుఖలభ్యయైన, రాజులకు రాజ్ఞియైన
పాదుకాదేవి నన్ను కాపాడింది)


సకర్ణిక షోడశదళ పద్మబంధం-
ఈ శ్లోకంలో ప్రతి రెండవ అక్షరం - పా
కావున దాన్ని పద్మం యొక్క కర్ణికలో వ్రాయాలి
ఈ శ్లకంలో మొత్తం 32 అక్షరాలున్నాయి
వీటిలో సగం అంటే 16 అక్షరాలు- పా- అనేవే ఉన్నాయి
పద్మం మధ్య దుద్దులో పా - ను వ్రాసి
ప్రతి రేకునకు ఒక అక్షరం చొప్పున వ్రాయగా
సకర్ణిక షోడశదళ పద్మబంధం పూర్తగును.
దీనిని చిత్రంలో బంధింస్తే ఇలా ఉంటుంది చూడండి-


No comments: