కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్
సాహితీమిత్రులారా!
సమస్య -
కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్
పూర్వకవి పూరణ-
అన్నన్న రాధసొగసున
కెన్నిక మగఁడులేమి హేలాగతిచే
నన్న యగు నందగోపుఁడు
కన్నకుమారుండు మగఁడు గాఁగ వరించెన్
ఇందులో కన్నకుమారుడు కాదు
నందగోపుడు కన్నకుమారుడు
అనడంతో సమస్స అర్థవంతమైన
పూరణ అయినది.
మీరును మరోరమ్యభావనతో పూరించి పంపగలరు
No comments:
Post a Comment