జడనింత వదులుగా అల్లినావేమి?
సాహితీమిత్రులారా!
17వ శతాబ్దిలోని విజయరాఘవుని
ఆస్థానములోని కవయిత్రి
రంగాజమ్మకు ఆమె చెలికత్తెకు
జరిగిన సంభాషణ చిత్రమిది
చూడండి-
"రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ అల్లినా వదే
మేజడ?" " యింతకంటెవలెనే?" "వలనొప్పబిగించి యల్లవే?"
"ఓ జవరాల! వేరెపనియున్నది" "దోసముదోసమే మహా
రాజగునట్టి యవ్విజయరాఘవుమై చిగురాకె కోమలీ"
సఖి- రాజనిభాననా! సరసురాలవు జబ్బుగ అల్లినా వదే మేజడ?
చంద్రముఖీ సహృదయవు - జడనింత వదులుగా అల్లినావేమి?
రంగాజమ్మ - యింతకంటెవలెనే?
ఇంతకంటే నేర్పుగా సమర్థంగా ఉండాలా?
సఖి - వలనొప్పబిగించి యల్లవే?
ఔనే జవరాల ఇంతకంటే నేర్పుగా
కామోచితమగునట్లుగా
బిగించి అఅల్లరాదా
రంగాజమ్మ- ఓ జవరాల! వేరెపనియున్నది
వేరే పనికూడ ఉన్నదే
సఖి - దోసముదోసమే
మహా రాజగునట్టి యవ్విజయరాఘవుమై చిగురాకె కోమలీ
తప్పు తప్పే
విజయరాఘవుని శరీరంపై (మెత్తని) చివురాకువుగదా!
No comments:
Post a Comment