Sunday, February 12, 2017

ఆకల్పం వసుధా మేతాం


ఆకల్పం వసుధా మేతాం




సాహితీమిత్రులారా!



గూఢచిత్రంలో అనేక విధాలున్నాయి.
వాటిలో క్రియాగూఢము ఒకటి
దీనికి ఉదాహరణగా ఈ శ్లోకం చూడండి-

రాజ న్నవఘనశ్యామ నిస్త్రింశాకర్షదుర్జయ
ఆకల్పం వసుధా మేతాం విద్విషోద్యరణే బహూన్


నవఘనశ్యామా - క్రొత్త మబ్బువలె నల్లనైన,
నిస్త్రింశా కర్షదుర్జయ = ఖడ్గాన్ని బైటకులాగుటచే
                                        జయింప శక్యముకాని,
రాజన్ = ఓ రాజా!
ఏతాంవసుధాం = ఈ భూమిని,
ఆకల్పం = కల్పాంతం వరకు,
అద్య = ఇప్పుడు,
రణే = యుద్ధమునందు,
బహూన్ విద్విషః = చాలమంది శత్రువులను  -

అని అర్థం స్ఫురిస్తుంది.
కాని ఇందులో భూమిని, శత్రువులను
ఏమిచేయాలో చెప్పలేదు కావున
తాత్పర్యం బోధపడదు కదా

అందువలన ఇలా చెప్పాలి -

రాజన్ + అవ = రాజన్నవ = ఓ రాజా రక్షింపుము
                                                భూమిని కల్పాంతము
                                                 వరకు పాలించుము.

విద్విషః + ద్య = విద్విషోద్య
ద్య = ఖండించుము - అని అర్థం
అంటే యుద్ధంలో చాలమంది శత్రువులను
సంహరిచుము అని భావం.

అవ - రక్షణే, దో - ఖండనే - అనే ధాతువుల
యొక్క లోట్ మధ్యమ పురుష ఏకవచన రూపాలు ఇవి.
దీనిలో ఈ రెండు క్రియారూపాలు గుప్తంగా ఉన్నాయి
కావున ఇది క్రియా గుప్తమని అనబడుతున్నది

No comments: