Friday, February 3, 2017

వైద్యంవారి చిత్రకవిత - 1


వైద్యంవారి చిత్రకవిత - 1




సాహితీమిత్రులారా!



సాహితీలోకంలో నిరంతర అన్వేషి, పరిశోధకరత్న
శ్రీమాన్ వైద్యం వేంకటేశ్వరాచార్యులవారు
ఈయన చిత్రవిత్వాన్ని శతకాలలో వెలయించారు
ఇందులో ఈయనకు బంధకవిత్వం అంటే మిక్కిలి ప్రీతి.
ఈయన 1969 నుండి 2011వరకు వెలయించిన 12 శతకాలను
శతకద్వాదశి పేరున ప్రకటించారు. వానినుండి చిత్రకవితను చూద్దాం-

శ్రీకురుమూర్తి శ్రీనివాస శతకములోని చిత్రకవిత-
ఇది కందపద్య శతకము. దీనిలో మకుటము తప్ప
మిగిలినది చిత్రకవితగా ఉంటుంది.

శబ్దచిత్రం-

ఏకాక్షరి -
- అనే హల్లును ఉపయోగించి కూర్చినది.

నానానూనా నానా
నానాన్నని నిన్నునెన్ననా నేనన్నా
నేనాననూని నేనీ
వానిని కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (94)


ద్వ్యక్షరి -
న,మ-లను ఉపయోగించి కూర్చినది

నామనమున మానను నీ
నామమననమన్న నేను నన్నోమిన నా
నోమిమ్మౌ నోనాన్నా
స్వామీ కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (95)


త్య్రక్షరి -
ఇందులో న-- - అనే మూడు హల్లులను
ఉపయోగించి కూర్చబడినది

నామతి నీనుతి నూనితి
మామానిని నమిత మామమామా మాపా
నేమమున నోము నన్నో
స్వామీ కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (96)


స్వరాక్షరి - 
సప్తస్వరములలోని
స,రి,గ,మ,ప,ద,ని - అనే వాటితో పద్యం కూర్చటం.

దరిధామ మామమామా
గరిపా దాసాగా సన్నిగమపా మాపా
గరిమన్నీదరినిమ్మా
వరదా కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (97)

(దరిధామ - గుహలలో ఉండు  కురుమూర్తి స్వామి,
గరిపా - గరుత్మంతునికి ప్రభువా,
దాసాగ - దాసులపాలిటికొండా,
సన్నిగమపా - శ్రేష్ఠములైన వేదములను పాలించువాడా)

తలకట్టు కందము-
(సర్వలఘు కందము)

దరధర భవభయహర ఖర
కర శశధరనయన ఖగపగమన వరద శం
కరసఖ కనకవసన నర
వరసఖ కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (98)




No comments: