వైద్యంవారి చిత్రకవిత - 4
సాహితీమిత్రులారా!
చిత్రకవిత్వంలో, గర్భకవిత్వం లాగే
బంధకవిత్వం కూడ ఒక భాగం.
బంధకవిత్వానికే ఆకార చిత్రం అని పేరు
దీనిలో ఒక ఆకృతిలో పద్యాన్ని వ్రాయడం
(బంధించడం) జరుగుతుంది. వాటి ఆకారాలను
బట్టి వాటికి పేర్లుంటాయి.
దీనిలో వైద్యం వారు కూర్చిన బంధాలు
శైలబంధములు - 2
గోమూత్రికా బంధము - 1
నాగపాశ బంధం - 1
చక్రబంధం - 1
పుష్పమాలికా బంధాలు - 3
గంధ/పుష్పపాత్ర బంధం - 1
ఖడ్గబంధం - 1
మొత్తం 10 బంధాలను శతకాలలో కూర్చారు.
శైలబంధం -
శైలం అంటే పర్వతం,
పర్వతం ఆకారంలో వ్రాయబడిన కవిత ఇది
ఇందులో మధ్యన కవిపేరుగాని,
వారి దేవతపేరుగాని వచ్చే విధంగా
కూర్చబడుతుంది.
ఈ కందపద్యంలో శైలబంధం
కూర్చారు వైద్యం వారు చూడండి-
శ్రీశ కుధర ధర్మజనుత
హేశితి కంఠార్చితపద హేనరసఖ లో
కేశుడ త్రెంపగదవె భవ
పాశము కురుమూర్తి శ్రీనివాస మహాత్మా (85)
శ్రీ
శ కుధ
ర ధర్మజను
తహేశితికంఠార్చి
తపద హేనరసఖ లో
కేశుడ త్రెంపగదవె భవపా
శము కురుమూర్తి శ్రీనివాస మహాత్మా
దీనిలో మధ్యన" శ్రీకుర్మతి నగశ్రీ "- అని కూర్చబడినది.
No comments:
Post a Comment