ముత్యమే కార్తెలో ముందు జన్మించు?
సాహితీమిత్రులారా!
శ్రీ వాపిసెట్టి సీతారామకవి రచించిన ఈ పొడుపు పద్యం చూడండి.
సమాధానం చెప్పగలరేమో?
ఆలోచించండి.
పద్మనాభుని ప్రక్క బాయని దెవ్వరు?
పంక్తి ముఖుండేపె బలిమి గూడె?
భాగీరథుండేమి పాటించి తెచ్చెను?
భావజ జనకుని పానుపేది?
గ్రహరాజసూనుని ఘనమైన పేరేమి?
మహిలోన భూపతి యన్న నేమి?
ముత్యమేకార్తెలో ముందు జన్మించును?
సోమకు నేమియై స్వామి దునిమె?
అన్నిటికి మూడేసి అక్షరములు
ఆదిపంక్తిని జూచిన నలరుచుండు
అట్టి శ్రీరంగనాయకు డనుదినంబు
మనల కరుణావిధేయుడై మనుచుచుండు
దీనిలోని షరతులు -
1. సమాధానాలు మూడక్షరాల్లో ఉండాలి.
2. సమాధానాలన్నిటి మొదటి అక్షరాలను కలుపగా శ్రీరంగనాయకస్వామి అని రావాలి
చూడండి ఆలోచించి.......
1. పద్మనాభుని పానుపు విడువని దెవతె? - శ్రీలక్ష్మి (పద్మ)
2. రావణుడు బలాత్కరించి రమించినది ఎవతెను? - రంభ(తో)
3. భగీరథుడు తపస్సు చేసి దేనిని సాధించాడు? - గ 0గను(భాగీరథిని)
4. మన్మథుని తండ్రి విష్ణువు యొక్క పానుపు ఏది? - నాగము (ఆదిశేషుడు)
5. గ్రహాధిపతి సూర్యుడు ఆయన కొడుకు ఎవరు? - యముడు
6. భువిలో భూపతికి గౌరవమిచ్చునది ఏది? - కరుణ (దయ)
7. మంచి ముత్యము ఏ కార్తెలో మొదట పుట్టును? - స్వాతిని
8. విష్ణువు ఏ అవతారమెత్తి సోమకాసురుని చంపెను? - మీనమై (చేపయై)
1 comment:
ఆనందో బ్రహ్మ
Post a Comment