Sunday, July 24, 2016

మాంగల్యం తంతునానేన.......


మాంగల్యం తంతునానేన.......


సాహితీమిత్రులారా!

నడిమింటి మంగళేశ్వరశాస్త్రిగారు
వారి ఊరిలో
ఒక వివాహముహూర్తము జరుగు
నపుడు తాంబూలమునకై వెళ్ళెను.
మంగళసూత్రధారణ సమయంలో
పురోహితుడు

"మాంగల్యం తంతునానేన మమజీవన హేతునా
కంఠే బద్నామి సుభగే త్వం జీవ శరాదాం శతమ్"

 అని చదివాడు.
దానికి మంగళేశ్వరశాస్త్రిగారు పక్కకు తిరిగి
అక్కడ ఉన్నవారితో
మీ కీశ్లోకం అర్థం తెలిసినదా? అని అడిగాడట.
అదేదో కొంటె సమాధానం ఉంటుందని
అక్కడి వారంతా తెలియదు మీరు చెప్పండని అడిగారట.
దానికి ఆయన అర్థం-

మాంగల్యం తంతు - న = ఇది మాంగల్య తంతుకాదు. 
(నేను ముసలి ముండ కొడుకును. చాలా పెళ్ళిళ్లు నాకు జరిగాయి 
ఇంకెక్కడి మాంగల్యం - అని భావం.) 
మమ - జీవనహేతు. న (న) =   దీనిచే నాబ్రతుకు దెరువు చెడింది. 
(రెండెకరాలో, మూడెకరాలో తెగనమ్మి కన్యాశల్కం క్రింద ఇచ్చి ఉన్న 
ఉపాధి పోయింది - అని భావం) 
కంఠే - బద్నామి = నీ కుత్తుకకు తాడు కట్టుచున్నాను. 
(నా వల్ల నీకు సౌఖ్యంలేదు సరికదా 
ఇదొక నిర్భంధం కూడా నీకు కల్గుతుంది- అని భావం.) 
సుభగే = ఓ సుభగురాలా!, 
త్వం = నీవు (సుభగురాలువు గనుక), 
శరదాం శతమ్ = నూరేండ్లు, 
జీవ = జీవించు.
- అని అర్థం చెప్పాడట.

12 comments:

sarma said...

రాజుగారు
పేరు పొరబడ్డారు సరి చేయండి.
శ్రీ నడిమింటీ సర్వమంగళ శాస్త్రి గారు,నడిమింటి మంగళేశ్వరశాస్త్రిగారుకాదు వీరి గురించిన ఒక అద్భుతమైన ఘట్టమే ఉంది.

sarma said...

నడిమింటి

ఏ.వి.రమణరాజు said...


శర్మగారికి,
నడిమింటి మంగళేశ్వరశాస్త్రులు విశాఖపట్టణము పార్వతీపురం తాలూకా, నాగూరు గ్రామ వాసిగాను, ఆయన అన్నగారు రుక్మేశ్వరశాస్త్రులుగాను చదివి ఉన్నాను. సర్వమంళశాస్త్రిగారి పేరు విన్నాను కాని ఆయన ఇంటిపేరు గాని ఆయన గురించి నాకు తెలియదు. సర్వమంగళశాస్త్రిగారిని గురించి తెలుపగలరని మనవి

sarma said...రాజుగారు,
ఇద్దరమూ పొరపాటే పడ్డాం. ఈ లింక్ లో చూడండి, వారి వంశీకులు చెప్పినమాట, ఆయన మనుమరాలు చెప్పినదే.http://sowmyanadiminti.blogspot.in/2011/03/ma-poorvikula-gurinchi-klupthamga.html

వారిపేరు

నడిమింటి సర్వమంగళేశ్వర శాస్త్రి

వివరాలు లింక్ లో ఉన్నాయి చూడండి.వీరు గొప్ప మంత్ర శాస్త్రవేత్త, ఆ సందర్భంగా జరిగినదే నేను అనుకున్న సంఘటన, నా బ్లాగులో తప్పక రాస్తా,వీరి గురించి.
ధన్యవాదాలు.

Zilebi said...


ఎవరండీ శర్మ గారు నడిమింటి వారి గురించి బాగా తెలిసిన వారిలా ఉన్నారే ?


జిలేబి

ఏ.వి.రమణరాజు said...


శర్మగారికి,
మీరు పంపిన బ్లాగ్ లోని వివరాలు చూచిన తరువాత
నడిమింటి మంగళేశ్వరశాస్త్రిగారు,
నడిమింటి సర్వమంగళేశ్వరశాస్త్రిగారు
ఒకరే అని తేలింది.
వివరాలు తెలిపిన మీకు ధన్యవాదాలు.

విన్నకోట నరసింహా రావు said...

< "ఎవరండీ శర్మ గారు ......... ? "
----------------------
సీరియస్స్‌గా అడుగుతున్నారా జిలేబీ గారు? ఈ శర్మ గారు మీకు పరిచితులే అయిన "కష్టేఫలే" శర్మ గారే. అన్నట్లు తన బ్లాగుల్లోకి ఆహూతులకు మాత్రమే ప్రవేశం అని ఇటీవలే ప్రైవేట్ బ్లాగులుగా మార్చేసుకున్నారు, గమనించారా? బహుశః బ్లాగ్‌లోకపు పోకడల మూలంగానేమో!

Zilebi said...


మరీ చోద్యం గా ఉ‌ంది ! ఈ శర్మ గారు ఎన్ని ప్రొఫైల్స్ తో బ్లాగు లోకం లో తిరుగు తు న్ నా రండి బాబు !

కష్టెఫలి అని ఒక బ్లాగ్స్పాట్ ఉందే ఆయనే ఈయనా ?

ప్రొఫైల్ లో బ్లాగ్ లేదే మరి ?

తల తిరుగుతోందండీ బాబు


జిలేబి

Anonymous said...


తన (బ్లాగ్)ఇల్లు మూసేసుకుని ఇతరుల (బ్లాగ్)ఇల్లిళ్ళూ తిరుగుతున్నారన్నమాట ! (బ్లాగ్)లోకసంచారి ! (బ్లాగ్)ధర్మం శరణం గచ్చామి !

Anonymous said...


తన (బ్లాగ్)ఇల్లు మూసేసుకుని ఇతరుల (బ్లాగ్)ఇల్లిళ్ళూ తిరుగుతున్నారన్నమాట ! (బ్లాగ్)లోకసంచారి ! (బ్లాగ్)ధర్మం శరణం గచ్చామి !

శ్యామలీయం said...

శర్మగారు తన (బ్లాగ్)ఇల్లు మూసేసుకుని ఇతరుల (బ్లాగ్)ఇల్లిళ్ళూ తిరుగుతున్నారన్నమాట అన్న వెటకారం ఉందే అలాంటిది ఉచితానుచితాలు ఎరుగని ఇలాంటి Anonymous మహానుభావులే చేయగలరు! ఉచితఙ్ఞులు కానివాళ్ళు తనవ్రాతలను చూడనవసరం లేదనే ఆయన తనబ్లాగులు ప్రైవేట్ బ్లాగుగా మార్చారని అనుకుంటున్నాను. అందుకే

ఇతర కర్మ ఫలాని యదృచ్ఛయా
విలిఖితాని సహే చతురానన
అరసికేషు కవిత్వ నివేదనం
శిరసి మాలిఖ మాలిఖ మాలిఖ

అని కవి మొత్తుకోవటం.

నీహారిక said...


నా సుఖ జీవన హేతువైన ఈ సూత్రంతో మాంగల్యాన్ని నీ మెడలో కడుతున్నాను. నీవు నూరేళ్లు వర్ధిల్లు !

శ్లోకానికి అసలు అర్ధం చెప్పకపోతే వారన్నదే కరెక్ట్ అని భావితరాలు పొరపడే వీలున్నది కదా ?