పుష్ణతి పుష్పధనుషం.........
సాహితీమిత్రులారా!
వృత్త్యనుప్రాసలోని 12 విధాలలో కార్ణాటీ, కౌంతలి, కౌంకి,
కౌంకణి, బాణవాసిక, ద్రావిడి-లను గురించి తెలుసుకున్నాము.
ఇపుడు 7. మాథురీ వృత్త్యనుప్రాసమును
గురించి తెలుసుకుందాము.
శ, ష, స, హ - అను వర్ణాలను ఊష్మములు అంటాము.
ఈ ఊష్మవర్ణములు అనుప్రాసగా ఉన్న
దానికి మాథురీ వృత్త్యనుప్రాసము అంటాము.
పుష్ణతి పుష్పధనుషం ముష్ణతీ ప్లోషవిప్రుష:
మిషన్తీ నిర్నిమేషేణ చక్షుషా మానుషీ న సా
(సరస్వతీకంఠాభరణము - 2 - 184)
(పుష్పధన్వియైన మన్మఛుని పోషించుచున్నది.
విరహదాహకణములను విరజిమ్ముచున్నది.
నిర్నిమేష నేత్రముతో చూచుచున్నది.
ఆమె మనుష్యస్త్రీ కాదు.)
ఈ శ్లోకంలో ష- వర్ణము పెక్కుపర్యాయాలు ఆవృత్తమైనది.
ఇదే విధంగా ష, స, హ - లు కూడ ఆవృత్తము చెందవచ్చు.
ష వర్ణావృత్తివలన
ఇది మాథురీవృత్త్యనుప్రాసము
అగుచున్నది.
No comments:
Post a Comment