ఫాలాక్షుతనయుని పక్షివాహనమేది?
సాహితీమిత్రులారా!
శ్రీవాపిసెట్టి సీతారామకవి కృత పొడుపుపద్యం ఒకటి చూచి ఉన్నాము.
ఇపుడు మరొకటి చూద్దాము.
పొంచుండి రాముడు త్రుంచెను దేనిని?
శంభుండు గప్పిన శాలువేది?
పూతనయై వచ్చి పొలియించె నెవ్వరి?
పెద్దరాతికి మారుపేరదేది?
చందురు డేతీరు ముందుగా గనిపించు?
జలజాక్షు చక్రమే చలువ నుండు?
ఫాలాక్షుతనయుని పక్షివాహన మేది?
హరి యేమియై పురా లవని గూల్చె?
అన్నిటికి జూడ మూడేసి అక్షరములు
నడిమ మాత్రల యందున నలరునట్టి
తిరుమలేశుండు నెప్పుడు స్థిరముతోడ
మనల కరుణావిధేయుడై మనుచునుండు
దీనిలోని షరతులు -
1. సమాధానాలన్నీ మూడు అక్షరాల్లోనే ఉండాలి
2. నడిమి అక్షాలను కలుపగా తిరుమల వేంకటేశ్వరుని పేరు రావాలి
ఇక ఆలోచించి సమాధాన్లు చెప్ప ప్రయత్నించండి.
1. దొంగచాటుగా దాగి, రాముడు దేనిని చంపెను? - కోతిని (వాలిని)
2. శివుడు కప్పుకొన్న చర్మము(శాలువా) ఏది? - చర్మము(గజాసుర)
3. పూతన అనే రాక్షసి పాలిచ్చి ఎవరిని చంపెను? - బాలల(గొల్లవారి)
4. పెద్దబండరాతికి మరొకపేరేమి? - (గ్రావా + ఇంద్రం) - గ్రావేంద్రం
5. చందమామ మొదట ఏవిధంగా కన్పిస్తుంది? - వంకర
6. విష్ణుచక్రమెట్లుండును? - (గుండ్రంగా) - వట్రము
7. ముక్కంటి కొడుకుకుమారస్వామి పక్షివాహనమేది? - నెమలి
8. విష్ణువు భువిలో ఏ రూపమున త్రిపురముల దహించెను? - బాణమై
No comments:
Post a Comment