సుదీర్ఘో ఘోరఘర్ఘర:
సాహితీమిత్రులారా!
వృత్త్యనుప్రాసలో సంకరములను తెసుకొనుచున్నాము.
అందులో మాత్సీ గురించి తెలుసుకున్నాము.
ఇపుడు మాగధీ వృత్త్యనుప్రాసమును గురించి
తెలుసుకుందాము.
మూడు వర్గముల అనుప్రాస ఘటకములయిన అది మాగధీ.
కాని ఇక్కడ మరో అంశం గుర్తులో ఉంచుకోవాలి
ఏమనగా ఒక వర్గము ప్రధానమై ఆద్యంతముండును.
నడుమ మరొకదానితో చేరి మరల దాన్ని వదలి మరొకదానితో కలిసి
అంతము వరకు కొనసాగును.
ఇలా మాగధీ విచ్ఛిత్తి కలిగి ఉండును.
మూడు వర్గములతోను కలిసినప్పటికి ప్రధానమైనది
ఒకటి రెండింటితో కలిసి సాగును.
ఉదాహరణ చూడండి.
అఘౌఘం నో నృసింహస్య ఘనాఘనఘనధ్యని:
హన్యాద్ఘురుఘురాఘోర: సుదీర్ఘో ఘోరఘర్ఘర:
(సరస్వతీకంఠాభరణము -2- 186)
(నరసింహునియొక్క ఘురుఘురాఘోరమును, సుదీర్ఘమును,
ఘోరఘర్ఘరమును అయిన మేఘ గంభీరధ్వని
మా పాపముల సమూహమును నాశము చేయుగాక)
దీనిలో క - వర్గము ప్రధానమైనది ఇది మొదటినుండి చివరివరకు సాగినది.
అయితే రెండవ పాదములో ఘనాఘనఘనధ్వని:- అనే చోట
త - వర్గములోని న-తో చేరినది. మూడు,నాలుగు పాదములలో
త-వర్గన్ని వదలి అంతస్థములతో జంట కూర్చుకొన్నది.
ఇక్కడ ర- ఎక్కువగా కనిపించుచున్నది.
కావున ఇది మాగధీవృత్త్యనుప్రాసాలంకారమగుచున్నది.
No comments:
Post a Comment