Friday, July 8, 2016

మామేతి మలయానిల:



మామేతి మలయానిల:


సాహితీమిత్రులారా!

వృత్త్యనుప్రాసలోని 12 విధాలలో కార్ణాటీ, కౌంతలి, కౌంకి,
కౌంకణి, బాణవాసిక, ద్రావిడి, మాథురీ -లను
గురించి తెలుసుకున్నాము.
ఇపుడు 8. మాత్సీ  వృత్త్యనుప్రాసమును
గురించి తెలుసుకుందాము.

రెండు లేక మూడు వర్గముల అనుప్రాసగల
దాన్ని మాత్సివృత్త్యనుప్రాసము అంటారు.

కోకిలాలాపవాచాలో మామేతి మలయానిల:
ఉచ్ఛలచ్ఛీకరాచ్ఛాచ్ఛ నిర్ఝరాంభ: కణోక్షిత:

(కోకిలాలాపవాచాలమును, పై కెగురుచున్న తుంపరులు
గల స్వచ్ఛమైన ప్రవాహమునందలి జలదిందువులచేత
తడపబడినదియు అయిన మలయానిలము
నన్ను పొందుచున్నది.)

వృత్త్యనుప్రాసలోని 12 విధములలో మొదట చెప్పుకొన్న
కార్ణాటీ, కౌంతలి,
కౌంకి, కౌంకణి,
బాణవాసిక, ద్రావిడి,
మాథురీ అను 7 అనుప్రాసలు శుద్ధానుప్రాసలు
మిగిలిన ఐదు అనుప్రాసలు సంకరములు.
ఆ ఐదింటిలో మాత్సి మొదటిది.

ఈ శ్లోకంలో - వర్గము, -వర్గము, - వర్గము అనేకమార్లు
ఆవృత్తమైనవి వీనితోపాటు అంతస్థములును అధికముగానే
ఆవృత్తమైనవి.
రెండు లేక మూడు వర్గలు అనుప్రాసమైన మాత్సీ అన్నారు.
కాని ఇందులో మూడిటికంటె ఎక్కువ వర్గాలు ఆవృత్తమైనవి
కావున దీన్ని అనేక వర్గానుప్రాసవతీ అనే భావంతో తీసుకోవచ్చును.
కావున ఈ శ్లోకము మాత్సీవృత్త్యనుప్రాసమునకు
ఉదాహరణగా చెప్పవచ్చును.
ఈ శ్లోకము దండి కావ్యాదర్శమునుండి గ్రహించబడినది.

No comments: