మేలా! యీసంరంభము
సాహితీమిత్రులారా!
మేడేపల్లి వేంకటరమణాచార్యులుగారి దేవవ్రతచరిత్రలో
మూడవ ఆశ్వాసంలో కొన్ని పద్యాలు సంభాషణ చిత్రంలో
వ్రాయబడ్డాయి. వాటిలో ఒకటి
దేవవ్రతుడు అంటే భీష్ముడు - అంబను వివాహమాడమని
పరశురాముడు కోరగా దానికి నిరాకరించడంతో
వారిద్దరి మధ్య యుద్ధం అనివార్యమైంది.
ఆ సందర్భంలోనిది ఈ పద్యం
భీష్మ పరశురాముల సంభాషణ ఇది.
కందపద్యంలో వ్రాయబడింది.
భీష్ముడు - మేలా! యీసంరంభము
హేలా సంతర్జితావనీశ్వర! నీకున్
జామదగ్న్య(పరశురాముడు)-
బాలామణిగైకొనుమీ
భీ. - వాలాయము సేయనౌనె? భార్గవ చెపుమా!
No comments:
Post a Comment