అనుకరణ పద్యం
సాహితీమిత్రులారా!
చాటుపద్యమణిమంజరిలోనిది ఈ పద్యం
న్యాయంబు దప్పని నరపతి నరపతి
నరపతి పాలించు నాడునాడు
నాడెఱింగిన దొర పోఁడిమి పోఁడిమి
పోఁడిమి సొబగైన బుధులు బుధులు
బుధులు సంభావించు పురుషుండు పురుషుండు
పురుషోత్తముని మీఁది బుద్ధిబుద్ధి
బుద్ధిమంతునకై పుణ్యంబు పుణ్యంబు
పుణ్యలక్షణమైన పొలఁతి పొలఁతి
పొలఁతి యట్టిద కలవాని కలిమి
కలిమి చలమని తెలిసిన తెలివి తెలివి
భానునిభ తేజ లక్కమాంబా తనూజ
మనుజ మందార సింగన మంత్రిమాచ
(భా.1-పుట.97)
దీనిలో ఈ క్రింది పోతన భాగవతంలోని
పద్యానుకరణతో పాటు
ముక్తపదగ్రస్తాలంకాము కలదు.
కమలాక్షు నర్చించు కరములు కరములు
శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ
సురరక్షకునిఁ జూచు చూడ్కులు చూడ్కులు
శేషశాయికి మ్రొక్కు శిరము శిరము
విష్ణు నాకర్ణించు వీనులు వీనులు
మధువైరిఁ దవిలిన మనము మనము
భగవంతు పలగొను పదములు పదములు
పురుషోత్తముని మీఁది బుద్ధి బుద్ధి
దేవదేవునిఁ జింతించు దినము దినము
చక్రహస్తునిఁ బ్రకటించు చదువు చదువు
కుంభినీధవుఁ జెప్పెడి గురుఁడు గురుఁడు
తండ్రి హరి జేరు మనియెడి తండ్రి తండ్రి
(7-169)
No comments:
Post a Comment