గృహిణి అంటే ఇల్లాలు కాదా?
సాహితీమిత్రులారా!
చాలా పదాలకు మనకు తెలిసిన అర్థాలే
కాకుండా వేరే అర్థాలు కూడా ఉంటాయి.
అలాంటివి కొన్ని మనం ముందు తెలిసికొని ఉన్నాము.
ఇప్పుడు మరికొన్నిటిని తెలుసుకుందాము.
పదము సాధారణార్థం ప్రత్యేకార్థం
నరేంద్రుడు - రాజు - పాములవాడు
శుచి - శుభ్రత - శృంగార రసము
పాళి - కలము పాళి - మీసాలు కల స్త్రీ
గృహిణి - ఇల్లాలు - కందిరీగ
ఆట - ఆట - నింద
వ్యంజనము - భోజన పదార్థము - మర్మావయవము
ప్రాయము - యౌవనము - మరణించువరకు ఆహారము లేకుండుట
శివ - గౌరి - నక్క
శ్రద్ధాళువు - శ్రద్ధకలిగిన వ్యక్తి - వేవిళ్ళుగల స్త్రీ
భాగ్యము - సంపద - పాపము
వివరము - వివరము - రంధ్రము
గ్రామీణ - గ్రామ సంబంధము - వేశ్య
కళ - చంద్రునిలో 16వ భాగము - మూర్ఛ
అసలు - అసలు - బురద
వితండము - మొండియైన - తాళము
ఇలాంటి పదాలను గూఢచిత్రంలోను,
కూటచిత్రంలోను, ప్రహేళికలలోను
ఉపయోగిస్తారు.
No comments:
Post a Comment