Sunday, July 10, 2016

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు


రాజిత నగాగ్రమున విహారంబు సల్పు


సాహితీమిత్రులారా!

ద్విపది గురించి కొంతకాలం క్రిందట తెలుసుకొని ఉన్నాము.
ఇది మరొకటి గమనింపుడు.
ఇందులో 1,3 పాదములు సమానము,
అలాగే 2,4 పాదములు సమానము.

రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠాతిశయము రాణిలుటకంటే
రాజిత నగాగ్రమున విహారంబు సల్పు
నీలకంఠాతిశయము రాణిలుటకంటే
                                     (సారంగధరీయము - 2-138)

రాజిత - ప్రకాశించునట్టి,
నగాగ్రమునన్ - పర్వతశిఖరమునందున,
విహారముసల్పు - వేడుకగా తిరుగునట్టి,
నీలకంఠ - ఈశ్వరుని యొక్క,
అతిశయము - గొప్పదనము,
రాణిలుకంటె - ఒప్పారుటకన్న,
రాజిత - ప్రకాశించునట్టి,
నగాగ్రమునన్ - చెట్టు చివరయందున,
విహారంబు సల్పు - సంచారము చేయునట్టి,
నీలకంఠ - నెమళ్ళ యొక్క,
అతిశయము - గొప్పతనము,
రాణిలుట - ఒప్పారుట,
కంటె - చూచితివా.

2 comments:

Unknown said...

Mee blog chala bagundi. What is your email?

ఏ.వి.రమణరాజు said...


నా రాజేష్ గారు
మీరు "చిత్రకవితా ప్రపంచం" బ్లాగును చూచి వ్యాఖ్య తెలిపి నందులకు ధన్యవాదాలు.
మీరు నా ఈ-మెయిల్ ఐడి అడిగారు ఇంత వరకు నేను ఎవ్వరికి ఇవ్వలేదు.
మీరు గోప్యంగా ఉంచాలని కోరుతూ ఇస్తున్నాను.
ramanarajuav6292@gmail.com