సున్న మిప్పుడు తేగదే సుందరాంగి
సాహితీమిత్రులారా!
ఇది గూఢచిత్రంలోను, సంభాషణ చిత్రంలోను
రెండింటికి సరిపోవు పద్యం.
ఒకానొకాయన ఒక ఆవిడను సున్నం అడిగిన
తీరు ఈ పద్యంలో చూడవచ్చు.
గమనించండి.
పర్వత శ్రేష్ఠపుత్రికా పతి విరోధి
అన్న పెండ్లాము అత్తను గన్న తండ్రి,
ప్రేమ వారింట పెరిగిన పెద్దబిడ్డ
సున్నమిప్పుడు తేగదే సుందరాంగి!
పర్వత శ్రేష్ఠపుత్రికా - శ్రేష్ఠహిమవంతుని(మేలైన) కూతురు - పార్వతి,
పార్వతి పతి - శివుడు,
అతని విరోధి - మన్మథుడు,
మన్మథుని అన్న - బ్రహ్మ,
బ్రహ్మ పెండ్లాము - సరస్వతి,
ఆమె అత్త - లక్ష్మిదేవి,
ఆమె కన్నతండ్రి - సముద్రుడు,
ఆయన పెద్దబిడ్డ - జ్యేష్ఠాదేవి - పెద్దమ్మ
దీని భావం -
దీనికి ఆమె సున్నం ఇచ్చిందా? - ఇస్తే ఏమని ఇచ్చింది,
లేక ఏమి అనకుండా ఇచ్చిందా? - అది మీరు ఆలోచించండి.
తరువాత తెలుసుకుందాం.
No comments:
Post a Comment