Monday, July 4, 2016

సీతారావణసంవాదఝరి


సీతారావణసంవాదఝరి


సాహితీమిత్రులారా!

ఇది ఒక పుస్తకం పేరు. దీని వెనుక చాల చిత్రమైన
శ్రమతోకూడిన కథ ఉంది. దాన్ని తెలుసుకుందాము.
చిత్రమీమాంసలోని ఒక శ్లోకాన్ని జూన్ 30, 2016న
తెలుసుకొని ఉన్నాము. ఆ శ్లోకం

భవిత్రీ రమ్భోరు త్రిదశవదనగ్లానిరధునా
స మే రామ: స్థాతా న యుధి పురతో లక్ష్మణసఖ:
ఇయం యాస్యత్యుచ్చైర్విపదమధునా వానరచమూ:
లఘిష్ఠేదం షష్ఠాక్షరపరవిలోపాత్పఠ పున:

ఈ శ్లోకం చ్యుతాక్షరచిత్రంగా చెప్పుకొని ఉన్నాము.
ఈ శ్లోకమే ఈ సీతారావణసంవాదఝరి - కి స్ఫూర్తి దాయకమైనది.
ఇతరవిధాలైన చమత్కారాలు ఉన్న పుస్తకాలు చాలా ఉన్నాయి.
నిగూఢార్థ చమత్కారంగల కావ్యం ఒకటికూడ లేదు.
ఉన్నవాటిలో ఒక శ్లోకమో ఒక వాక్యమో ఉంటున్నాయి.
ఉన్నవి కూడ రెండు మూడు కూడ దొరకవు అందుచేత
ఒక ప్రబంధం రాయాలని మైసూరురాజాస్థాన పండితుడైన
19 శతాబ్దికి చెందిన శ్రీచామరాజనగరి రామశాస్త్రి అనే విద్వత్కవి
ఈగ్రంథం 100 శ్లోకాలతో రాయాలనే కోరికతో మొదలు పెట్టి
30 సంవత్సరాలు ఆలోచిస్తూ 50 శ్లోకాలు మాత్రమే పూర్తి చేశాడు.
కానీ 100 శ్లోకాలు పూర్తి చేయాలని ప్రతినపూనిన ఆయన విచారిస్తూ
మిగిలిన యాభై శ్లోకాలు పూర్తి చేసిన వారికి
వేలకొలది నమస్కారాలు పెడతాను - అని అంటూ
ఆ పని ఇతరులెవరైనా చేస్తే బాగుంటుందని సూచించాడు.
తరువాత రామశాస్త్రిగారి ప్రముఖశిష్యుడైన సీతారామశాస్త్రి
సీతారావణసంవాదఝర్యుత్రభాగం పేరుతో పూర్తి చేశాడు.
ఈ విషయం తెలియక మన తెలుగువాడైన బచ్చు సుబ్బరాయగుప్త
గారు అభినవసీతారావణసంవాదఝరి పేరుతో మరొక కావ్యం రాశారు.
ఒకరి సంకల్పంతో మూడు పుస్తకాలు వెలువడ్డాయి.
ఇవి మహాద్భుత చిత్రకవితా కావ్యాలు.
వీటి అప్పుడప్పుడు తెలుసుకుందాము.

No comments: