Friday, July 1, 2016

హింతాల కృత పుండ్రా వధూరివ


హింతాల కృత పుండ్రా వధూరివ


సాహితీమిత్రులారా!

వృత్త్యనుప్రాసాలంకారంలోని కర్ణాటీ, కౌంతలీ, కౌంకి, కౌంకణీ,
బాణవాసికా -లను గురించి తెలుసుకున్నాము.
ఇపుడు 6వది అయిన ద్రావిడి గురించి తెలుసుకుందాము.


అంతస్థములు - య,ర,ల,వ - అనే నాలుగు వర్ణాలు.
అంతస్థములు అనుప్రాసగా ఉండిన దానికి ద్రావిడి అని పేరు.

ప్రియాల లవలీ తాల తమాలై లావనావలీ
భాతి పత్త్రల హింతాల కృత పుండ్రా వధూరివ

                                    (సరస్వతీకంఠాభరణము -2- 183)

(ప్రియాలము, లవలి, తాలము, తమాలము, ఏలకి అను
వనాల సముదాయము సాంద్ర పత్రములుగల
హింతాలములచేత తిలకము దిద్దబడిన
వధువు వలె భాసించుచున్నది.)

ఈ శ్లోకంలో ,-లు ఎక్కువగాను,
- తక్కువగాను ఆవృత్తములైనవి.
- వర్ణము ఒక్కసారిమాత్రమే ప్రయుక్తమైనది.
అంతస్థముల ఆవృత్తిని బట్టి ఇది ద్రావిడీ వృత్త్యనుప్రాసకు
ఉదాహరణమౌతున్నది.

No comments: