Monday, July 25, 2016

హృదయమపి తే చండి కఠినమ్!


హృదయమపి తే చండి కఠినమ్!


సాహితీమిత్రులారా!

బాణభట్టు, మయూరభట్టు ఇద్దరు బంధువులని ప్రతీతి.
బాణునికి మయూరకవి బావమరిది.
ఒకరోజు మయూరుడు తన ఇంటికి ఆలస్యంగా వెళ్ళడంతో
ఆయన భార్య కోపించి తలుపు తీయకుండా బయటే నిలబెట్టిందట.
రాత్రంతా బయట పడిగాడ్పులు కాచిన మయూరుడు
తెల్లవారు జామున తలుపు తీయమని భార్యను
బ్రతిమాలుతూ........
ఈ శ్లోకం చెప్పడం మొదలు పెట్టాడు.

గతప్రాయా రాత్రి: కృశమపి శశి శీర్ణత ఇవ
ప్రదీపో2యం నిద్రావశముపగత: ఘూర్ణత ఇవ
ప్రణామాంతో మానస్తదపి న జహాసి కృధమహో...

(రాత్రి దాదాపు గడిచి పోయింది,
చంద్రుడు కూడా తేజస్సు కోల్పోయాడు.
దీపం కూడా నిద్రపోతున్న మనిషిలాగా తూగుతూంది.
ఎంత వేడుకున్నా నీ కోపం వీడకున్నావు..............)


అప్పుడే ఆ దారిన పోతున్న
బాణభట్టు ఈ క్రింది విధంగా పూరించాడు.

కుచ - ప్రత్యాసత్యా హృదయమపి తే చండి కఠినమ్
(ఓ చండికా! నీ (కఠిన) ఉరోజాలకు అతి సమీపంలో ఉండటం


వల్లనే నేమో నీ హృదయం కూడా ఇంత కఠినంగా ఉంది.)

2 comments:

శ్యామలీయం said...

రమణరాజుగారూ,

శ్లోకం బాగుంది. ముగింపు మరింతగా ఒప్పింది. కాని బాణుడు ఆ తెల్లవారు జామున వీధుల్లోపడి ఎందుకు తిరుగుతున్నాడూ అని?

మీ చమత్కారశ్లోకాలు బాగుంటున్నాయి. కాని మీరు ౽ అని వ్రాయవలసిన చోట 2 అని అంకె ఎందుకు వాడుతున్నారు? మీ దగ్గర ఉన్న తెలుగుఫాంటులో ఆ సౌకర్యం లేదా? మీరు ప్రముఖ్ IME ( http://vishalon.net/PramukhIME/Windows.aspx ) వాడిచూడండి. Installation కూడా అవసరం లేదు. నేరుగా వాడుకోవటమే! వాడటం కూడా చాలా తేలిక. ఇది కూడా phonetic typing తో పనిచేస్తుంది. ఇలా 2 అని అంకెను వాడవలసిన అగత్యం ఉండదు.

Zilebi said...



:: కాని బాణుడు ఆ తెల్లవారు జామున వీధుల్లోపడి ఎందుకు తిరుగుతున్నాడూ అని?

జిలేబి లా బాణునికీ కాలక్షేపం బఠాణీ లంటే మోజు కామోసు :)

జిలేబి