అనుకరణ పద్యం
సాహితీమిత్రులారా!
ఈ పద్యం నాచనసోముని ఉత్తరహరివంశము -లోనిది.
అభ్రంకషం బైనయాలపోతు నితండు
త్రుంచినాఁడీతండు పెంచినాఁడు
సాధుసమ్మతముగా సామజంబు నితండు
గాచినాఁ డీతండు ద్రోచినాఁడు
బర్హిర్ముఖార్థమై పర్వతేశు నితండు
దాల్చినాఁడీతండు వ్రాల్చినాఁడు
ఫణపరంపరతోడిపన్నగేంద్రునితండు
మెట్టినాఁడీతండు సుట్టినాఁడు
నేఁడు నాఁడును నాఁడును నేఁడు మనకుఁ
జూపఁ జెప్పంగ జెప్పంగఁ జూపఁగలిగె
ననుచుఁ గొనియాడుసంయమిజనుల కొదవె
రజతగిరిమీఁద హరిహరారాధనంబు.
(2-180)
అనుకరణ పద్యం
నెనరుఁజూపులు వాఁడిఁ దనరు తూపులు భక్తి
పరులపై నరులపైఁ బఱపువాడఁడు
చుట్టుకైదువుఁదమ్మిఁబుట్టునైదువు నైజ
కరమున నురమునఁ గలుగువాఁడు
చందుఁగేరెడు తమ్మివిందు మీఱెడుశంఖ
రాజంబు తేజంబు గ్రాలువాఁడు
కెంపు పావలు విడియంపు ఠేవలునాత్మ
పదముల రదములఁ బరఁగు వాఁడు
రంగ రమణుఁడ భంగ సామ్రాజ్య లక్ష్మి
నొసఁగుగాత నిజాంఘ్రి సారసమదాళి
పటల దరివీర మకుటాగ్ర ఘటిత దివిజ
రాజమణికిని జిక దేవరాజమణికి
(చాటుపద్యమణిమంజరి భా.-1, పు.53)
1 comment:
ఇంతటితో ఆగిపోయింది ఎందుచేత? ఎవ్వరూ స్పందించలేదని మానకండి. కొందరు అంతే. ఆనందిస్తారు కాని ఆ సంగతి చెప్పరు. మంచి పద్యమే ఎన్నుకొన్నారు! శుభాకాంక్షలు!
Post a Comment