Wednesday, July 6, 2016

రే2ధమ ముహురలం త్వాం శ్రుతవతీ



రే2ధమ ముహురలం త్వాం శ్రుతవతీ


సాహితీమిత్రులారా!

శ్రీచామరాజనగరీ రామశాస్త్రిగారి
సీతారావణసంవాదఝరీ పూర్వభాగంలోని
మొదటి శ్లోకం చూడండి-

పరిక్షీణాలస్య: సమరభువి రక్ష:కులపతి:
సలజ్జ: స్వస్తుత్యామమలహితమార్గైకపథిక:
ప్రణమ్రస్త్రీలభ్య: సుముఖి విలసత్కీర్తిరితి చ
శ్రుతో నాహం కిం రే2ధమ ముహురలం త్వాంశ్రుతవతీ


రావణుడు తనను పొగడుకుంటూ సీతతో ఇలా అంటున్నాడు-

హేసుముఖి = అందమైన ముఖంగల ఓ సీతా! ;
సమరభువి = యుద్ధభూమి యందు
పరిక్షీణాలస్య: = తొలగిన అలసత్వం కలవాడను
(అలసత్వం లేనివాడను) ;
రక్ష:కులపతి: = రాక్షససమూహానికి ప్రభువును;
స్వస్తుత్యాం = తన స్తుతియందు;
సలజ్జ: = లజ్జ కలవాడను;
అమలహితమార్గైకపథిక: = నిర్మలమూ హితమూ అయిన
మార్గమునందు ఒకే ఒక బాటసారిని;
నమ్రస్త్రీలభ్య: = నమ్రత గల స్త్రీలచేత పొంద తగినవాడను;
విలసత్కీర్తి: ఇతి చ = ప్రకాశిస్తూన్న కీర్తి కలవాడను;
అహమ్ = నేను ; న శ్రత: కిమ్ = (నీచేత) వినబడలేదా?

సీత సమాధానం-
రే అధమ - ఓ అధముడా!; అలమ్ - చాలును;
త్వామ్ - నిన్ను గూర్చి; ముహు: - అనేకపర్యాయాలు
శ్రుతవతీ - విని ఉన్నాను.

నిగూఢార్థం -
అలమ్ - 'ల' - కారం లేనివానినిగా, త్వామ్ - నిన్ను, శ్రుతవతీ - విని ఉన్నాను.

రావణుని మాటలలోని "" తీసివేయగా -
పరిక్షీణాస్య: సమరభువి రక్ష:కుపతి:
సజ్జ: స్వస్తుత్యామమహితమార్గైకపథిక:
ప్రణమ్రస్త్రీభ్య: సుముఖి విసత్కీర్తిరితి చ
శ్రుతో నాహం కిం
సమరభువి = యుద్ధభూమి యందు
పరిక్షీణాస్య: = క్షీణించిన ముఖం కలవాడనీ
రక్షకుపతి: = రాక్షసుల చెడ్డరాజనీ;
స్వస్తుత్యాం = తన స్తుతియందు;
సజ్జ: = ఎల్లపుడు సిద్ధంగా ఉండేవాడనీ;
అమహితమార్గైకపథిక: = చెడ్డమార్గంలో మాత్రమే నడచేవాడనీ,
స్త్రీభ్య: =  స్త్రీల కొరకు, ప్రణమ్ర: - వంగేవాడనీ  
విసత్కీర్తి: ఇతి చ = పోయిన సత్కీర్తి కలవాడను(సత్కీర్తి లేనివాడనీ);

చాలాసార్లు విన్నాను.
ఈ విధంగా పదాలలోని ఒక అక్షరం మార్పు రావడంతో
అర్థం పూర్తిగా మారిపోయింది.
దీనిలోని "" అనే అక్షరం తొలగిపోయింది
కావున ఇది చ్యుతాక్షరిచిత్రం

2 comments:

కంది శంకరయ్య said...

‘రేఽధమ’... ఽ దీనిని కాపీ చేసి ఎక్కడైనా సేవ్ చేసి పెట్టుకోండి. అవసరమైనప్పుడు వినియోగించుకోవచ్చు.

ఏ.వి.రమణరాజు said...


మీ సలహాకు ధన్యవాదాలు