Sunday, April 9, 2017

భగముల వార్చెదరు సంధ్య భవ్యచరిత్రుల్


భగముల వార్చెదరు సంధ్య భవ్యచరిత్రుల్




సాహితీమిత్రులారా!



సమస్య-
భగముల వార్చెదరు సంధ్య భవ్యచరిత్రుల్

సి.వి.సుబ్బన్నగారి పూరణ-

జగతీనిర్జరు లొకచో
భగీరథసుతాజలములఁ బంకేరుహషం
డ గళ న్మరంద బిందు సు
భగముల వార్చెదరు సంధ్య భవ్యచరిత్రుల్

ఇందులో భగములు అనగానే
అశ్లీలార్థము స్ఫురించును
ఇక్కడ కవిగారు సుభగముల - అంటే
ఏమి అర్థం తీసుకున్నాడో చూడండి-

జగతీనిర్జరులు - బ్రాహ్మణులు,
పంకేరుహ షండగళత్ - పద్మముల సమూహము నుండిజాఱు
మరందబిందు సుభగముల - తేనె చుక్కలచే సుందరములైన,
భగీరథసుతా జలముల - గంగాజలములందు, సంధ్యవార్చెదరు.
భవ్య - చరితులు - భవునకు అంకితమైన నడకగలవారు.


మీరును మరోవిధమైన అర్థంతో పూరించి పంపగలరు.


No comments: