దీని భావమేమి తిరుమలేశ?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం విప్పండి-
కాళ్ళుగలిగియుండు కదలదట్టిట్టును
నోరిలేదు పెక్కు నీరుద్రావు
తనకుప్రాణిలేదు తరువుల భక్షించు
దీని భావమేమి తిరుమలేశ?
కాళ్లుండాయి కాని అటిఇటు కదలదు
చాలానీరుత్రాగుతుంది కాని నోరులేదు
తనకు ప్రాణంలేదు కాని చెట్లను తింటుంది
దాని భావమేమో చెప్పమంటున్నాడు కవి
సమాధానము - గంధపుసాన(గంధాన్ని నూరే సాన)
No comments:
Post a Comment