Thursday, April 6, 2017

తనపాలన్ తనుత్రావి రొమ్ములను గ్రుద్దన్


తనపాలన్ తనుత్రావి రొమ్ములను గ్రుద్దన్ 




సాహితీమిత్రులారా!


సమస్య - 
తనపాలన్ తనుత్రావి రొమ్ములను గ్రుద్దన్ న్యాయమే ధర్మమే


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

వనమాలిన్ వధియింప కంసుడు మహావైరంబునన్ క్రోధియై
ఘన రక్షోజనమెల్లఁబంప, మదిలో కాంక్షించి, తొల్దొల్తగా
పనిచెన్ రక్కసిఁ, గృష్ణుడున్ తెలిసి, ఠేవన్ వేవధింపంగ - పూ
తనపాలన్ తనుత్రావి రొమ్ములను గ్రుద్దన్ న్యాయమే ధర్మ మే

ఇందులో
తనపాలన్ అనే దాన్ని పూతన పాలన్ గా మార్చినందున
అంగతమైన విషయము సందర్భోచితంగా మారింది.


మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.




No comments: