Saturday, April 8, 2017

నెలలు నిండి రాముడు కనెన్


నెలలు నిండి రాముడు కనెన్




సాహితీమిత్రులారా!



సమస్య -
నెలలు నిండి రాముడు కనెన్ లవునిన్ కుశునిన్ ముదంబునన్


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

కలతవహించి, సీతనిలకానకంపి, వ్యధార్తుడై, సదా
తలపున నింపి, యాగమును తాజరిపింపగ అశ్వమున్ వి డన్
వలపున దాని పట్టిరని - వారలె పుత్రులటంచెఱింగి, వె
న్నెలలు నిండి రాముడు కనెన్ లవునిన్ కుశునిన్ ముదం బునన్

ఇందులో నెలలు నిండి
రాముడు లవకుశును కనలేదట
వెన్నెలలు నిండి అని పూరించడం
వలన అసందర్భం సందర్భమైంది

మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

No comments: