కంద గీత గర్భ శైల బంధోత్పలమాల
సాహితీమిత్రులారా!
ఉత్పలమాలలో కందపద్యాన్ని, తేటగీతి పద్యాన్ని
ఇమిడ్చి ఆ పద్యాన్ని శైలబంధంగా కూర్చాడు
రాప్తాటి ఓబిరెడ్డిగారు తన శ్రీనివాస చిత్రకావ్యంలో
చూడండి-
శ్రీసుకవిస్తుతా మరపుజెందక లాలన మన్పు శ్రీశ నా
నా సుకృతాద్యశోమహిత న్యాయ విచారణ మౌనివంద్య దే
వా సుకశాన్వితా తరణిభా సకలార్థయుతా హరాప్త శౌ
రీ సుకరా హరీ జయధురీణ చరిత్ర ప్రశాంత భాషణా
గర్భిత కందము-
శ్రీసుకవిస్తుతా మరపుజెందక లాలన మన్పు శ్రీశ నా
నా సుకృతాద్యశోమహిత న్యాయ విచారణ మౌనివంద్య దే
వా సుకశాన్వితా తరణిభా సకలార్థయుతా హరాప్త శౌ
రీ సుకరా హరీ జయధురీణ చరిత్ర ప్రశాంత భాషణా
సుకవిస్తుతా మరపుజెం
దక లాలన మన్పు శ్రీశ నా నా సుకృతా
సుకశాన్వితా తరణిభా
సకలార్థయుతా హరాప్త శౌరీ సుకరా
గర్భిత గీతము-
శ్రీసుకవిస్తుతా మరపుజెందక లాలన మన్పు శ్రీశ నా
నా సుకృతాద్యశోమహిత న్యాయ విచారణ మౌనివంద్య దే
వా సుకశాన్వితా తరణిభా సకలార్థయుతా హరాప్త శౌ
రీ సుకరా హరీ జయధురీణ చరిత్ర ప్రశాంత భాషణా
మరపుజెందక లాలన మన్పు శ్రీశ
మహిత న్యాయ విచారణ మౌనివంద్య
తరణిభా సకలార్థయుతా హరాప్త
జయధురీణ చరిత్ర ప్రశాంత భాష
శైలబంధము-
ఇందులో శైలమధ్యమున పైనుండి క్రిందికి
"శ్రీకమలానాయకహరి" -
అని వచ్చును గమనించండి
శ్రీ
సుకవి
స్తుతా మరపు
జెందక లాలన మ
న్పు శ్రీశ నా నా సుకృతాద్య
శోమహిత న్యాయ విచారణ మౌ
నివంద్యదేవాసుకశాన్వితా తరణి
భా సకలార్థయుతా హరాప్త శౌరీ సుకరా
హరీ జయధురీణ చరిత్రప్రశాంతభాషణా
No comments:
Post a Comment