దండక గర్భ సీసము
సాహితీమిత్రులారా!
రాప్తాడి ఓబిరెడ్డిగారి
శ్రీనివాస చిత్రకావ్యంలోని
ఈ గర్భచిత్రం చూడండి-
సీసపద్యంలో దండకము ఇమిడ్చినది ఈ చిత్రము.
శ్రీశ! పరేశా! సురేశా! ధరాధీశ!
దాసోపకారీ! రథాంగధారి!
మాధారి! శౌరీ! హరీ! దానవారీ! ము
రారీ! గుణస్తోమ! హంసతేజ!
రామా! శుభాధిక్యనామా! పరంధామ!
కారుణ్యధామా! విదారితాఘ
రాజద్బలోద్దామ! రామామనఃకామ
ప్రేమాభిరామా! ప్రభూ! ముకుంద!
సుప్రకాశాంగ! సత్సంగ! సుప్రసంగ
జ్ఞానదాతా! విధాతార్చితా! నయాత్మ
శ్రీవరా! భూవరా! కావ వరాఖ్య
మౌనివంద్యా! నమస్తే నమస్తే నమః ప్రశస్త!
దీనిలోని దండకము -
శ్రీశ! పరేశా! సురేశా! ధరాధీశ! దాసోపకారీ!
మాధారి! శౌరీ! హరీ! దానవారీ! మురారీ!
గుణస్తోమ! రామా! శుభాధిక్యనామా! పరంధామ!
కారుణ్యధామా! విరాజద్బలోద్దామ! రామామనఃకామ ప్రేమాభిరామా! ప్రభూ!
ముకుంద! సుప్రకాశాంగ! సత్సంగ! సుజ్ఞానదాతా! విధాతార్చితా! శ్రీవరా! భూవరా! కావరా
మౌనివంద్యా! నమస్తే నమస్తే నమః
No comments:
Post a Comment