దీని భావమేమి తిరుమలేశ?
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం విచ్చండి-
కాళ్లదన్నగనిచ్చు కౌగిలించగనిచ్చు
పైకిబ్రాకిచనులబట్టనిచ్చు
కారుసారమెల్ల ఘనులు ద్రావుదురయా
దీని భావమేమి తిరుమలేశ?
కాళ్లతో తన్నినిస్తుంది
కౌగిలించుకోనిస్తుంది
పైకి ప్రాకి చనుల బట్టనిస్తుంది
కారు సారాన్నంతా గొప్పవారు త్రాగుతుంటారు
దీని భావమేమో చెప్పమంటున్నాడు కవి-
సమాధానం - 1. తాటిచెట్టు, 2. కల్లు
కాళ్లతో తన్నినిస్తుంది
కౌగిలించుకోనిస్తుంది
పైకి ప్రాకి చనుల బట్టనిస్తుంది - తాటిచెట్టు
కారు సారాన్నంతా గొప్పవారు త్రాగుతుంటారు - కల్లు
No comments:
Post a Comment