Thursday, April 6, 2017

లతల మీద వేళ్ళునుత నాట్యమాడును


లతల మీద వేళ్ళునుత నాట్యమాడును




సాహితీమిత్రులరా!




పొడుపు పద్యం చూడండి-

కాయమీద మాను కడురమ్యమైయుండు
మానుమీద లతలు మలయుచుండు
లతల మీద వేళ్ళు నుత నాట్యమాడును
దీని భావమేమి తిరుమలేశ

కాయమీ మాను చాల రమ్యంగా ఉందట
ఆ మానుమీద లతలు మలయుతున్నాయట
ఆ లతల మీద వ్రేళ్ళు పొగిడే విధంగా
నాట్యమాడుతున్నాయట -
 దీని భామేమిటో చెప్పమంటున్నాడు కవి

విచ్చండి లేదా చూడండి-

సమాధానము - వీణ
వీణకు క్రింది వైపు కాయ ఉంటుందికదా
కాయమీద మ్రాను లేక కొయ్య ఉంటుంది కదా
దానిమీద తంత్రులనే లతలుంటాయికదా
ఆ లతలనే తంత్రులపై వ్రేళ్ళు ఆడుతుంటాయి కదా
అంతే అదే వీణ

No comments: