Sunday, April 9, 2017

దీని భావమేమి తెలియబలుకు


దీని భావమేమి తెలియబలుకు



సాహితీమిత్రులారా!






పొడుపు పద్యం 
విప్పగలరేమో చూడండి-

మ్రానుకాలవేశి మహిలోననొకజాణ
పూని తిరుగుచుండు పొందుగాను
కాలనున్న మాను కడురమ్యమైయుండు
దీని భావమేమి? తిరుమలేశ!

ఒక చతురమైన స్త్రీ
మానును కాలవేసి పూని
పొందికగా తిరుగుతుందట
ఆ కాలిలో ఉన్న మాను
కడురమ్యంగా ఉందట
దీని భావమేమిటో తెలుపమంటున్నాడు కవి.

సమాధానం - పాము(వు)కోళ్ళు

No comments: