దీని భావమేమిటో చెప్పండి
సాహితీమిత్రులారా!
ఈ పొడుపు పద్యం విప్పండి-
అష్టబాహువులలరు నది రక్కసిగాదు
వెలయుజన్నిదంబు విప్రుడుగాడు
తోకనుండు చెవులు దుస్సహధ్వనిచేయు
దీని భావమేమి తిరుమలేశ
8 చేతులుంటాయట
కాని రాక్షసికాదట.
జందెముంటుంది కాని
విప్రుడుకాదు
తోక ఉంటుంది
చెవులు విపరీతమైన
ధ్వని కలిగిస్తాయి
దీని భావమేమిటో
చెప్పమంటున్నాడు కవి
సమాధానం - ఏకులరాట్నం
No comments:
Post a Comment