Sunday, April 2, 2017

మందునకున్ బానిసగుట మర్యాదగదా!


మందునకున్ బానిసగుట మర్యాదగదా!




సాహితీమిత్రులారా!


సమస్య-
మందునకున్ బానిసగుట మర్యాదగదా!


విద్వాన్ వి.యమ్.భాస్కరరాజుగారి పూరణ-

కందువమాటలు సేవ - ల
మందగతిన్ భక్తి చేసి, మంచితనంబున్
డెందమునన్ నిల్చు - కా
మందునకున్ బానిసగుట మర్యాదగదా!


ఇందులో మందునకు బానిసకావడమన్ని కాక
కామందునకు బానిసగుట వలన ఇది అసందర్భపు
విషయంగాలేదు. కావున పూరణ సమయస్పూర్తిగా
అర్థవంతంగా జరిగిందని చెప్పవచ్చు.


మీరును మరోవిధంగా పూరించి పంపగలరు

No comments: