కోతిని పెండ్లియాడె నొక కోమలి
సాహితీమిత్రులారా!
సమస్య : -
కోతిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
.
రాళ్ళబండి కవితాప్రసాద్ గారి పూరణ -
.
.
భీతమృగాక్షి యొక్కతె వివేచన కోల్పడె చర్మబాధచే,
నాతికి పెండ్లికాదని, వినాశనమౌనని నేస్తులెంచుచున్
జాతకముల్ గుణింపగ, భిషక్కుని సాయము పొంది మందొ, మా
కో, తిని పెండ్లియాడె నొక కోమలి స్నేహితురాండ్రు మెచ్చగా!
.
కోతిని అనే పదాన్ని విరిచి ప్రయోగించడంతో
సమస్యాపూరణ సమర్థవంతంగా సాగింది
మీరును మరోరకంగా పూరించి పంపగలరు.
No comments:
Post a Comment