Friday, April 7, 2017

రామాకశ్రీసమగ్రారణకృత(అష్టదళ పద్మబంధము)


రామాకశ్రీసమగ్రారణకృత(అష్టదళ పద్మబంధము)




సాహితీమిత్రులారా!


కావ్యాలంకార సంగ్రహములోేని
అష్టదళ పద్మబంధము చూడండి-

రామాకశ్రీసమగ్రారణకృతభయముద్రాససక్తారమారా
రామారక్తాససద్రాష్ట్ర భరణపటిమాత్రాసకున్తీకుమారా
రామాకున్తీకుసత్రాప్రకటతరవిచిత్రావిపత్రాసమారా
రామాసత్రాపవిత్రాశ్రయనరసరుచిగ్రామసశ్రీకమారా

రామా...సమగ్రా-
రామా - స్త్రీలకు, అక - పొందు, శ్రీ - సంపదచే,
సమగ్రా - సమృద్ధుడైనవాడా
రణ....మారా -
రణ - యుద్ధమున, కృత - చేయబడిన,
భయముద్రా - భయచిహ్నమగు,
అస - ఉనికి యందు(జడత్వమున),
సక్త - లగ్నమైన,
అరమారా - శత్రుసంబంధమగు సమూహముకలవాడా
రామాసక్తాస - స్త్రీలోలురను నిరసించువాడా
సద్రాష్ట్రభరణ- మంచిరాజ్యములను పాలించువాడా
పటిమ - అత్రాసకుంతీకుమారా - సామర్థ్యమునను,
భయభావమునను అర్జునుడయినవాడా
రామా- స్త్రీలను,
కుంతీ - గోధుమలను, కు - భూమిని,
సత్రా - సదా దానము చేయువాడా
ప్రకటితరుచిచిత్రా - ప్రసిద్ధములగు
విచిత్రకార్యములు కలవాడా
పవిత్రా - పవిత్రుడయినవాడా
సమారా- మన్మథునితో సమానుడా
రామాసత్రా - స్త్రీలను, ఉత్తములను ఆకర్షించువాడా
విపత్రాశ్రయ - విష్ణువును ఆశ్రయించినవాడా
సరస - సరసుడైనవాడా
రుచి .. మారా-
రుచిగ్రామ - కాంతి పుంజముచే,
సశ్రీక -  శోభతో కూడిన,
మారా - మన్మథుడైనవాడా

రామాకశ్రీసమగ్రారణకృతభయముద్రాససక్తారమారా
రామారక్తాససద్రాష్ట్ర భరణపటిమాత్రాసకున్తీకుమారా
రామాకున్తీకుసత్రాప్రకటతరవిచిత్రావిపత్రాసమారా
రామాసత్రాపవిత్రాశ్రయనరసరుచిగ్రామసశ్రీకమారా


దిగువ ఇవ్వబడిన బంధములో ప్రవేశము 
నిర్గమము అని ఇవ్వబడినవి వాటిని గమనిస్తూ
పద్యాన్ని చూస్తూ బంధంలోని విషయం గమనింపగలరు
బంధములో ప్రతిపాదంలో చివరల ఉన్న 7అక్షరముల
సముదాయము తరువాతి పాదము మొదటిలో విలోమంగా 
రావడం జరిగింది. చివరి పాదంలోని 
చివరి అక్షరములసముదాయము 
 మొదటిపాదంలోని 
మొదటి అక్షరములసముదాయము 
విలోమంగా వచ్చింది




No comments: