Tuesday, April 4, 2017

రాగములేని పాటలను రమ్యముగ వినిపింపుము


రాగములేని పాటలను రమ్యముగ వినిపింపుము




సాహితీమిత్రులారా!


సమస్య -
రాగములేని పాటలను రమ్యముగ వినిపింపుమిత్తరిన్


 సింహాద్రి శ్రీరంగం గారి పూరణ-

రాగము రమ్యమంచు జనరంజకమంచొక గాయకుండు తా
రాగములాగిలాగియవలన్ చిరుపద్యము పాడుచుండగా
బాగుగపల్కె శ్రోతయిటు పాటనుపెంచగదోయి దీర్ఘమౌ
రాగములేని పాటలను రమ్యముగ వినిపింపుమిత్తరిన్

ఇందులో రాగంలేకుండా పాడమని కనిపిస్తుంది కాని
పూరణలో రాగము దీర్ఘములైనవికాకుండా పద్యం పాడమని
చేయడంతో సందర్భశుద్ధిగా ఉన్నది

మీరును మరోవిధమైన పూరణచేసి పంపగలరు

No comments: