రతియే ముఖ్యము సర్వమానవులకున్
సాహితీమిత్రులారా!
సమస్య-
రతియే ముఖ్యము సర్వమానవులకున్ ప్రఖ్యాతి నార్జింపగా
విద్వాన్ వి.యమ్. భాస్కరరాజు గారి పూరణ-
ప్రతివారున్ మతిమంతులై మెలగగా ప్రాశస్త్యసద్విద్య యే
గతి ఏమారక దాని సాధకునైకాంక్షించి, భక్త్యాత్ములై
స్తుతిరీతిం భజియింప - శారదభువిన్ సొంపార వెల్గించు -భా
రతియే ముఖ్యము సర్వమానవులకున్ ప్రఖ్యాతి నార్జింప గా
ఇందులో రతికాదు ముఖ్యము
భారతిముఖ్యము సర్వమానవులకు
అని పూరించడం వలన విపరీతార్థము పోయి
సరైన అర్థంగా భాసిల్లినది
మీరును మరోవిధంగా పూరించి పంపగలరు.
No comments:
Post a Comment